Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - మహబూబ్ నగర్
రాష్ట్రంలో 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు తెలంగాణ సచివాలయానికి ఆయన పేరు పెట్టి రాజ్యాంగం సాక్షిగా 30 లక్షల నిరుద్యోగులకి రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు కుచ్చుటోపి పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మహబూబ్నగర్ పట్టణంలోని గడియారం చౌరస్తాలో ఆదివారం నిర్వహించిన నిరుద్యోగ నిరసన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు మెట్టుగడ్డ నుంచి గడియారం చౌరస్తా వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ వలస వచ్చి పాలమూరు జిల్లాలో పార్లమెంట్ సభ్యుడయినా ఈ జిల్లాకు నీళ్లు ఇవ్వడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఎత్తిపోతల పథకాలు తప్ప ఎనిమిదేం డ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇప్పటికీ 80 ఉద్యోగా లు ఖాళీగా ఉన్నాయంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉద్యోగాల పట్ల ఎంత ఆసక్తి ఉందో తెలుస్తుందన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు తెలంగాణ పోరాటాన్ని నడిపించింది ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప కేసీఆర్ ఏనాడు కూడా తెలంగాణ కోసం పోరాటం చేయలేదన్నారు. మొట్టమొదటి సారిగా చిన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ సభ వనపర్తి జిల్లాలో జరిగిన దృశ్యాన్ని చూసిన కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టి రాజకీయ దోపిడికి తెర లేపారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తర్వాత తిరిగి 80 ఏండ్లకు ఈ ప్రాంతవాసినయిన తనకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అవకాశం లభించిందన్నారు. ఈ జిల్లాలో 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరితే మళ్లీ మనకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తుందని తెలిపారు. నిరుద్యోగులు ఎవరు ఆందోళ న చెందొద్దని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. సభలో మాజీ ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, సంపత్ కుమార్, మల్లురవి, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు జై మధు సూదన్ రెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షులు వి హనుమంతరావు, ప్రసంగించారు.