Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి గంగుల కమలాకర్‌కు పొన్నం సవాల్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మొత్తం ఎంత ధాన్యం కొన్నారు? మీరు చెబుతున్నది ఎంత? దీనిపై బహిరంగ చర్చకు వస్తారా? అంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మంత్రి గంగుల కమలాకర్‌కు సవాల్ విసిరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలుకు సంబంధించి మంత్రి అవాస్తవాలు చెబుతున్నారని ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో మంత్రి చెబుతున్న అవాస్తవమని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25వేల పరిహారం ఇవ్వాలని కోరారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.