Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఆర్పీఎస్ రాష్ట్ర్ట అధ్యక్షుడు గోవిందు నరేష్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దళిత బంధు పథకంలో లబ్ధిదారుల నుంచి రూ. 3 లక్షల వరకు తీసుకున్న ఎమ్మెల్యేల చిట్టాను సీఎం కేసీఆర్ వెల్లడించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిండ్ నరేష్ మాదిగ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లోని బషీర్ బాగ్ వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్ రాం విగ్రహం ముందు ఎంఎస్పీ, ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్, ఎంఎంఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 'తెలంగాణలో అవినీతిలేని పాలనను అందిస్తామని, కన్న కొడుకు తప్పు చేసినా సహించేది లేదని' మాట్లాడిన కేసీఆర్ ..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దళితుల నుంచి రూ. 3 లక్షలు లంచం తీసుకుంటుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సీహెచ్ సోమశేఖర్ మాదిగ, ఎంఎస్పీ నాయకులు వి ఎస్ రాజు మాదిగ, ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు జేపీ లత మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.