Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 636 ప్రాంతాల్లో అకాల వర్షాలు
- కరీంనగర్లో 8.2 సెంటీమీటర్ల కుండపోత
- మరో మూడ్రోజులు వానలే..
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వాతావరణంలో వచ్చిన మార్పు లతో నడి వేసవిలో వర్షాకాలంలో పడినట్టే అకాల వర్షాలు పడుతు న్నాయి. ఆదివారం రాత్రి 11 గంటల వరకు రాష్ట్రంలోని 636 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో అత్యధికంగా 8.2 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. అదే జిల్లా దుర్షెడ్లోనూ 7.4 సెంటీ మీటర్ల వర్షం పడింది. 330కిపైగా ప్రాంతాల్లో మోస్తరు వర్షం (1.5 సెంటీ మీటర్లకు పైగా) కురిసింది. కరీంనగర్, హైదరా బాద్, జనగాం, జయ శంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నారా యణపేట, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాల్లోనూ పలు చోట్ల భారీ వర్షం పడింది. రాబోయే మూడు రోజులు పాటు రాష్ట్రంలో తేలికపాటి మోస్తరు వానలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైద రాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. పలు ప్రాంతాల్లో 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరం గల్, హన్మకొండ జిల్లాలకు వాతా వరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. గ్రేటర్ హైదరబాద్ పరిధిలో రాబోయే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే సూచనలు ఉన్నాయి. అదే సమ యంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం కూడా ఉంది.