Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశ్రమ నిర్మించవద్దని స్తంభంపల్లి గ్రామస్తుల నిరసన
నవతెలంగాణ- వెల్గటూర్
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటయ్యే పరిసర గ్రామాల్లో రోజురోజుకూ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా చిచ్చు రగులుతూనే ఉంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనను పోలీసులు అన్నివిధాల అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల ఒత్తిడి పెరిగినకొద్దీ ఆందోళన మరింత ఉధృతంగా మారుతోంది. కాగా, ఆదివారం తాజాగా స్తంభంపల్లిలో ఇథనాల్ మంటలు చెలరేగాయి. స్తంభపల్లి గ్రామంలో ఇథనాల్ పరిశ్రమ వద్దంటే వద్దంటూ గ్రామస్తులు మైసమ్మతల్లికి బోనాలతో మొక్కులు చెల్లించేందుకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో పోలీసులు, గ్రామస్తులకు మధ్య తోపులాట జరగగా గ్రామస్తులకు స్వల్పం గా గాయాలయ్యాయి. సీఐ కోటేశ్వర్, ఎస్ఐ నరేష్, నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా గ్రామస్తులు వినిపించుకోకుండా నెత్తిన బోనం ఎత్తుకుని వెళ్లి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు.