Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయన సాహిత్యానికి మరణం లేదు
- ఆ సాహిత్యంపై అధ్యయనం పెరగాలి :'శ్రామిక కవిసమ్మేళనం'లో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్ బ్యూరో
శ్రమనుంచే సాహిత్యం, సంగీతం, నాట్యం ఆవిర్భవిస్తాయనే వాస్తవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) ఎప్పటికీ చిరంజీవే అనీ, ఆయన సాహిత్యానికి మరణం లేదని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ వైస్‌ఛాన్సలర్ ఎస్వీ సత్య నారాయణ అన్నారు. తెలంగాణ సాహితి, అభ్యుదయ రచయితల సంఘం సంయుక్తాధ్వర్యంలో ఆదివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శ్రీశ్రీ జయంతి, మేడే సందర్భంగా 'శ్రామిక కవి సమ్మేళనం' నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ఎస్వీ సత్యనారాయణ ముఖ్యఅతిధిగా హాజరై, మాట్లాడారు. మహాకవి శ్రీశ్రీ ఆధునిక సాహిత్యాన్ని భూమార్గం పట్టించి, భూకంపం సృష్టించారని చెప్పారు. అప్పటివరకు భావుకతలో కొట్టుకుపో తున్న కవిత్వాన్ని అభ్యుదయ, విప్లవ మార్గం పట్టించి, సాహిత్యంలో సామా న్యుడికి చోటు కల్పించారని కొనియాడారు. పోరాడి సాధించుకున్న 8 గంట ల పనిదినాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయనీ, సెజ్‌ల పేరుతో పనిని 12 గంటలు తప్పనిసరి చేస్తూ, శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణ, అదా నీ, అంబానీకరణలు వచ్చేసి, ప్రజా జీవితాలను ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. ఈ దశలో శ్రీశ్రీ కవిత్వంపై యువరచయితలు, కవుల అధ్యయ నం మరింత పెరగాలని ఆకాంక్షించారు. 'అడ్డంగా రాస్తే వ్యాసం... నిలు వుగా రాస్తే కవిత్వం' కాదనీ, కలకాలం జనం నాలుకలపై నాట్యంచేస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ తట్టిలేపే రచనలు రావాలని చెప్పారు. మార్క్సిజం, లెనినిజం దార్శనికతతో కవిత్వం గోడలపై నినాదంగా మారాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో విశిష్ట అతిధిగా పాల్గొన్న తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ ప్రపంచంలో వర్గ దృష్టి, పేద, ధనిక తారతమ్యం ఉన్నన్నాళ్లు శ్రీశ్రీ జీవించేఉంటాడని అన్నారు. ఓంకారార్థాన్ని విప్లవానికి అన్వయించి, సంస్కృత భాషకు ప్రత్యామ్నాయాన్ని తన కవిత్వం ద్వారా చూపారన్నారు. కార్యక్రమానికి తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఆనందాచారి, తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపో లు సుదర్శన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత కందిమళ్ల ప్రతాపరెడ్డి, అభ్యుదయ పాటల రచయిత బండి సత్తన్నకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లా డుతూ శ్రీశ్రీ కవిత్వం ఎందర్నో ప్రభావితం చేసిందనీ, బాధ నుంచి పుట్టే కవిత్వం శాశ్వతమవుతుందని అన్నారు. ప్రముఖ రచయిత తంగిరాల చక్రవర్తి ఆహూతులను వేదికపైకి ఆహ్వానించగా, శరత్ సుదర్శి వందన సమర్పణ చేశారు. అంతకుముందు కేవీఎల్, సలీమ 'శ్రామిక కవి సమ్మేళనం' నిర్వహించారు.