Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లాటు నాదేనంటూ కబ్జాదారుడు అక్రమ నిర్మాణం
- పోలీసుల సహకారంతో బాధితులకు ఇబ్బందులు
- 12 గంటల పాటు పోలీసు స్టేషన్లోనే బాధితులు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కుడా లేఅవుట్ ప్లాట్ నెంబర్‌తో ఘరానా మోసానికి పాల్పడిన కబ్జాదారుని భాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు శ్రీనివాస్, రాజ్యలక్ష్మీ దంపతులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా హనుమాన్ నగర్‌కు చెందిన ఆమంచ శ్రీనివాస్ తండ్రి నర్సింహరాములు హసన్పర్తికి చెందిన జన్ను కొమురయ్య తండ్రి గట్టయ్య వద్ద హసన్‌పర్తి శివారు సర్వే నెం.140/ఎ లో 363 చదరపు గజాల నాన్ లేఅవుట్ స్థలాన్ని 2005లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 1349 ద్వారా తేదీ:2.2.2005లో కొనుగోలు చేశారు. ఈ క్రమంలో నర్సింహరాములు 2006లో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆ స్థలం ఖాళీగానే ఉండటంతో కబ్జాదారుడి కన్నుపడింది. వారి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతుండగా 2009లో ఒకసారి, 2023 ఏప్రిల్ నెలలో మరోసారి సర్వే చేసి ప్రస్తుతం కబ్జాదారుడు నిర్మాణం చేస్తున్న భూమి సర్వే నెం.140లోనే ఉందని సర్వే అధికారులు తెలిపారు. ఈ క్రమంలో 140 సర్వే నెంబర్ స్థలానికి మార్కింగ్ కూడా చేసి హద్దులు నిర్ణయించారు. అయినా కబ్జాదారుడు పోలీసుల సహకారంతో స్థలాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నించాడు.