Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- థాయ్‌లాండ్ పోలీసుల చిక్కిన మరో 93 మంది జూదరులు..
- వీరిలో రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు
- రూ. 100 కోట్ల మేరకు గ్యాంబ్లింగ్ జరిగినట్టుగా గుర్తింపు
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
గతంలో క్యాసినో కేసులో అరెస్టయి.. రాష్ట్రంలో సంచలనం రేపిన చీకోటి ప్రవీణ్ ఎట్టకేలకు థాయ్‌లాండ్ పోలీసులకు చిక్కాడు. ప్రవీణ్‌తో పాటు మరో 93 మంది క్యాసినో ప్రియులను కూడా థాయ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో రాష్ట్రానికి చెందిన కొందరు రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపార వేత్తలు కూడా ఉన్నారని సమాచారం. థాయ్ పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం థాయ్‌లాండ్‌లోని పఠాయ్ ప్రాంతంలోని ఆసియా హౌటల్‌పై థారు పోలీసులు జరిపిన ఆకస్మిక దాడిలో ఈ క్యాసినో గుట్టు రట్టయ్యింది. ముఖ్యంగా ఈ హౌటల్లో అత్యంత రహస్యంగా కాసినో నిర్వహిస్తున్నారు. గోప్యంగా సాగుతున్న ఈ వ్యవహారంతో.. ఒక్క సారిగా థాయ్ ప్రత్యేక పోలీసులు ఈ హౌటల్‌ను చుట్టుముట్టి దాడులు నిర్వహించారు. పఠాయ్ పోలీసు ఉన్నతాధికారి కాపూర్ లీల నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. ఇందులో ఆ సమయంలో రెండు టేబుళ్ల మీద సాగుతున్న గ్యాంబ్లింగ్ గుట్టు రట్టయ్యింది. దీంతో ఆప్రాంతంలో ఉన్న మొత్తం 93 మంది జూదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చివరి క్షణంలో క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్‌కుమార్ పారి పోతుండగా పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. అలాగే ఇతరులను కూడా తప్పించుకోకుండా వలేసి అదుపులోకి తీసుకున్నారు. వీరిని అరెస్టు చేసిన సమయంలో అక్కడి టేబుళ్లలో ఉన్న రూ. 1.60 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక యాభైకి పైగా క్యాసినో చిప్స్‌ను , 90 సెల్ ఫోన్లను , ఎనిమిది సీసీ టీవీ కెమెరాలను కూడా థాయ్ పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. అలాగే ఈ టేబుళ్ల నుంచి నాలుగు హుక్కా లను కూడా అధికారులు సీజ్ చేశారు. అరెస్టయిన వారిలో నలుగురు మయన్మార్‌కు , మరో ఆరుగురు థాయ్‌లాండ్‌కు చెందిన మహిళలు కూడా ఉన్నారు. మొత్తం మీద అరెస్టయిన 93 మందిలో 83 మంది తెలుగు వారుగా తెలుస్తోంది. ఇందులో చీకోటి ప్రవీణ్, అతని అనుచరుడు మాధవ్‌రెడ్డి, తో పాటు మెదక్ డీసీసీబీ చైర్మెన్ దేవేందర్‌రెడ్డిలతో పాటు మరి కొందరు రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు కూడా ఉన్నారని తెలుస్తోంది. కాగా ఈ క్యాసినోను సీతాన్ తైల్కర్ అనే మహిళ ఆధ్వర్యాన సాగిందని, ఇందుకోసం ఆమె ఆసియా హౌటల్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌ను బుక్ చేసి దానిని క్యాసినోగా మార్చినట్టు పోలీసులు తేల్చారు. కాగా థారు చట్టాల ప్రకారం గ్యాంబ్లింగ్ ఆడటం తీవ్రమైన నేరం కాగా అందులో హుక్కాను కూడా వినియోగించడం మహానేరంగా పరిగణిస్తారని అక్కడి అధికార వర్గాల ను బట్టి తెలుస్తోంది.