Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మెన్ జనార్ధన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌లను సుధీర్ఘంగా విచారించిన ఈడీ
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సంస్థ చైర్మన్ జనార్ధన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌లను ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం సుదీర్ఘంగా విచారించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో పెద్ద ఎ త్తున విదేశీ విద్యార్థులు కూడా ఈ పేపర్‌ను విక్రయించడం ద్వారా భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమమానిస్తోంది. ఈ కోణంలో ఇప్పటి వరకు ఈ కేసును విచారిస్తున్న రాష్ట్ర సిట్ విభాగం నుంచి కొంత సమాచారాన్ని కోర్టు ద్వారా సేకరించిన ఈడీ అధికారులు దాని ఆధారంగా తదుపరి దర్యాప్తును ముందుకు కొనసాగిస్తున్నా రుయ ఈ నేపథ్యంలోనే టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌లను కూడా విచారించాలని నిర్ణయించి వారిద్దర్ని పిలిచినట్టు సమాచారం.మధ్యాహ్నం నుంచి పేపర్ లీక్‌కు గల కారణాలు, అవి ఎలా చేతు లు మారాయి, నిందితుల చేతికి ఎలా చిక్కాయి.. తదితర కోణాల నుంచి విచార ణ జరుపుతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఇది వరకే ఈ కేసులో అరెస్టయిన నిందితులు ప్రవీణ్, కంప్యూటర్ అనలిస్టు రాజశేఖరరెడ్డిలను విచారించినప్పు డు తేలిన అంశాలను కూడా ఈ ఇద్దరు అధికారుల ముందు ఉంచి ప్రశ్నించారని తెలిసింది.ప్రధానంగా జనార్ధన్‌రెడ్డి పీఏ గా కూడా వ్యవహరించిన ప్రవీణ్‌కు టీఎస్పీఎస్సీలో అంత స్వేచ్ఛను ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నించినట్టు తెలిసింది.