Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి మూడోసారి ఎన్నికై హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ఆదివారం ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ఎన్నికలను నిర్వహించారు. ఇందులో సురేందర్ రెడ్డి ప్యానెల్ భారీ మెజార్టీతో విజయాన్ని సాధించింది. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా గోపి, ఉపాధ్యక్షులుగా జె చిన్నా, ఆర్థిక కార్యదర్శిగా రమేష్‌గౌడ్, మహిళా కార్యదర్శిగా ఈ పావని, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఐ వాణి, ఎల్ మహేష్, మల్టీ జోన్-1 సెక్రటరీగా జె శంకరయ్య, మల్టీ జోన్-2 సెక్రటరీగా కె తిరుపతయ్య ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా విద్యాధర్, భూపాల్ రెడ్డి, కె శ్రీనివాస్ వ్యవహరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులందరూ తనను మూడోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జూనియర్ లెక్చరర్ల సర్వీస్ లెక్కింపునకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులను సాధిస్తామని వివరించారు. కండిషనల్ ప్రమోటీస్కి సంబంధించి మినహాయింపు ఉత్తర్వులు కూడా త్వరలోనే రానున్నాయని చెప్పారు.