Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని వివిధ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ)ల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయినులకు వేసవి సెలవులివ్వకుండా, ప్రతిరోజు పాఠశాలలకు వెళ్లాలంటూ సమగ్ర శిక్షా స్టేట్ ప్రాజెక్ట్ అధికారి ఆదేశాలివ్వడం సరైంది కాదని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం సోమయ్య, టి లింగారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. అన్ని పాఠశాలల మాదిరిగానే కేజీబీవీ ఉద్యోగులకు కూడా వేసవి సెలవులివ్వాలంటూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనను వారు కలిసి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులు లేనప్పటికీ వేసవిలో కూడా ఉపాధ్యాయులు ప్రతిరో పాఠశాలకు హాజరు కావాలంటూ హుకుం జారీ చేయడం విరమించుకోవాలని కోరారు.