Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మేడే పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు నిర్వహించాలని ఏఐకేఎస్ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి చెప్పారు. సోమవారం హైదరాబాద్లోని రైతు సంఘం రాష్ట్ర కార్యాలయం ముందు మేడే సందర్భంగా ఎర్రజెండాను ఎగిరేసిన అనంతరం ఆయన మాట్లాడారు. హక్కులను సాధించుకునేందుకు సాగిన పోరాటమే మేడే అని చెప్పారు. నేటి పాలకులు నాడు పోరాడి సాధించుకున్న హక్కులకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. ప్రజాస్వామిక విలవలకు నీళ్ళొదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'ప్రపంచ కార్మికులారా ఏకంకండి..! అంటూ ఆనాడు కార్మిక వర్గం పిలుపునిస్తే..నేటి బీజేపీ పాలకులు ప్రజల్లో అనైక్యతను సృష్టించి, మత విద్వేషాలను రెచ్చగొట్టి, మతోన్మాద రాజ్యాన్ని నిర్మించేందుకు ఊవ్విళ్ళూరూతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా కార్మిక, కర్షక ఐక్యతతో వర్గ ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి సాగర్ మాట్లాడుతూ రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు, సీఐటీయూల ఆధ్వర్యంలో వారం రోజుల పాటు మేడే వారోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మోడీ అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టకపోతే..దేశ భవిష్యత్ అంధకారంలోకి నెట్టబడుతున్నదిని ఆందోళన వ్యక్తం చేశారు.సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ చట్టాలను క్రోడీకరించే పేరుతో కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కార్మిక హక్కులను హరించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ల అమలుకు రాష్ట్రాలపై ఒత్తిడి తేవడం దుర్మార్గమని విమర్శించారు. వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయం ముందు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు జెండా అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహారెడ్డి, పి జంగారెడ్డి, ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, రాష్ట్ర నాయకులు భాగ్యలక్ష్మి, రాహుల్, వ్యసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బి ప్రసాద్, మహిళా వింగ్ కన్వీనర్ బి పద్మ, రాష్ట్ర నాయకులు అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.