Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిటిఅయోగ్ ప్రశంస
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఇంధన పొదుపులో రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలు భేషుగ్గా ఉన్నాయని నిటి అయోగ్ ప్రసంసించినట్టు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివద్ధి సంస్థ (రెడ్కో) చైర్మెన్ వై సతీష్ రెడ్డి తెలిపారు. రెడ్కో తీసుకొచ్చిన ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) అమలు ఆచరణయోగ్యమని కొనియాడిందన్నారు. మూడేండ్లలో 336 మెగావాట్ల విద్యుత్తు ఆదా చేశామని చెప్పారు. ఈసీబీసీ నిర్ణయాన్ని పటిష్టంగా అమలు చేసినందుకు గాను నిటిఅయోగ్ దీనిని బెస్ట్ ప్రాక్టీసింగ్గా గుర్తించిందని వివరించారు. ప్రభుత్వం నిర్మించే అన్ని భవనాల్లో ఈసీబీసీ అమలు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడాన్ని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ గుర్తించి జాతీయస్థాయిలో అవార్డును అందజేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ల చొరవ, ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శి సునీల్‌శర్మ దిశానిర్దేశంలో ఈ ఘనత సాధ్యమైందని చెప్పారు. విద్యుత్ పొదుపులో భాగంగా దేశంలోనే మొదటిసారిగా కూల్‌రూఫ్ పాలసీని తీసుకొచ్చామన్నారు. రెడ్కో సంస్థ నూతన భవనాన్ని పూర్తి ఇంధన పరిరక్షణ విధానాలతో, నెట్ జీరో గ్రీన్ బిల్డింగ్‌గా నిర్మిస్తున్నామనీ, త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తుందని వివరించారు.