Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు మంత్రి సబిత ధన్యవాదాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యాశాఖలోని 3,897 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించడం చారిత్రాత్మకమని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను మంత్రి కలిసి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో గతంలో కాంట్రాక్టు అధ్యాపకులకు వేతనాలు పెంచిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. గతంలో ఏడాదికి పది నెలల వేతనం ఇస్తే కేసీఆర్ ఏడాదికి 12 నెలలకు వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. చరిత్రలోనే రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా పీఆర్సీని వర్తింపజేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు.