Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల ద్వారా అందించే రూ.603 కోట్ల ఆర్థిక సాయానికి సంబందించిన యాక్షన్ ప్లాన్ మొదలైందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో బీసీ ఆత్మగౌరవ భవనాల పురోగతిపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, మహాత్మాజ్యోతిరావు ఫూలే వెనుకబడిన గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టుతో కలిసి మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు వేల కోట్ల విలువైన స్థలాల్లో బీసీ ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నదని తెలిపారు. వీటిని సకల హంగులతో ఆయా కులాల ఆత్మగౌరవాన్ని ప్రతిఫలించేలా నిర్మించాలనీ, మౌలిక వసతుల కోసం విద్యుత్, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వేగంగా పనులు జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. ఎంజేపీ విద్యార్థులు అత్యున్నత ప్రతిభ కనబరుస్తున్నారనీ, జేయీయీ మెయిన్స్ క్వాలిఫై అయిన విద్యార్థులకు తదుపరి అడ్వాన్స్ శిక్షణ అందించాలని ఆదేశించారు.