Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీలో మాదిరిగా రూ.21 వేల వేతనమివవ్వాలి
- తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మున్సిపల్ కార్మికులకు రూ.1000 మేర వేతనం పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ గొప్పగా ప్రకటించడం సరిగాదనీ, అది కంటి తుడుపు చర్యే అని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలనీ, వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాలడుగు భాస్కర్, జనగాం రాజమల్లు ఒక ప్రకటన విడుదల చేశారు. మొదటి పీఆర్సీలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు బేసిక్ పే రూ.19 వేలుగా నిర్ణయించి చెల్లించాలని సూచించగా..రూ.15,600 వేతనంగా నిర్ణయిస్తూ జీవో 60 విడుదల చేశారని తెలిపారు. పీఆర్సీ నిర్ణయించిన వేతనంలో భారీగా కోతలు పెట్టి ప్రస్తుతం నామమాత్రంగా వెయ్యి రూపాయల వేతనం పెంచడం కంటి తుడుపు చర్యే అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాల్టీల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.