Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుద్యోగ విద్యార్థి జేఏసీ డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని నిరుద్యోగ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. ఈమేరకు సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ వద్ద జేఏసీ చైర్మెన్ భీంరావునాయక్, నాయకులు ఈశ్వర్‌లాల్, మేడ శ్రీను నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భీంరావునాయక్ మాట్లాడుతూ నూతన సచివాలయం ప్రారంభం సందర్భంగా కేసీఆర్ చేసిన తొలి సంతకం ఒక బూటకమని పేర్కొన్నారు. 2014 నుంచి జేఎల్, డీఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్లు, ఇతర ప్రభుత్వ 10శాఖల్లోని 40 విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామనడం నిరుద్యోగ విద్యార్థులకు అన్యాయం చేయడమేనని తెలిపారు. నోటిఫికేషన్లు వేయకుండా కాలయాపన చేసి నిరుద్యోగుల జీవితాల్లో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. సురేష్ నాయక్, గిరి, వినోద్‌తోపాటు నిరుద్యోగ విద్యార్థులు పాల్గొన్నారు.