Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జాఫ్రీ పదవి విరమణ పొందారు. సోమవారం శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి తన చాంబర్లో శాలువా కప్పి సత్కరించారు. ఎమ్మెల్సీగా జాఫ్రీ చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా గుత్తామాట్లాడుతూ దాదాపు 13 ఏండ్లుపాటు జాఫ్రీ ఎమ్మెల్సీగా నిబద్ధతతో సేవలు అందించారని తెలిపారు. ప్రభుత్వానికి మంచి సలహాలు సూచనలు చేస్తూ సభ సజావుగా నడవడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చైర్మెన్ బండ ప్రకాష్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు, టీఆర్ఎస్ఎల్పీ సెక్రెటరీ రమేష్ రెడ్డి ఉన్నారు.