Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధుల కొరత లేదు, వేగంగా చెల్లింపులు : మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రతికూల పరిస్థితుల్లోనూ ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా కొనసాగుతున్నాయని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లో ధాన్యం సేకరణపై మంత్రి సమీక్షించారు. నిధుల కొరత లేదనీ, చెల్లింపులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వీలుగా బాయిల్డ్ చేయడానికి జిల్లాలకు ఆదేశాలు జారీ చేసినట్టు స్పష్టం చేశారు. మొత్తం 1.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి అత్యవసర బాయిల్డ్ ఉత్తర్వులు ఇచ్చామనీ, సేకరణ జరుగుతున్న తీరుగానే వీటిని పెంచుతామని తెలిపారు. గతేడాది 3.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఈ ఏడాది 7.51 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించినట్టు మంత్రి వెల్లడించారు. ఐదు వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 40 వేల మంది రైతుల నుంచి రూ.1,543 కోట్ల విలువైన 7.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్నిసేకరిస్తున్నాయని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.