Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అర్థరాత్రి పూట చెన్నూరు భూపోరాట నాయకుల ఇండ్లమీద దాడి చేసి ఇద్దరు మహిళలతో సహా నలుగురు నాయకులను అరెస్టు చేయడాన్నీ, 12 మందిపై కేసులు పెట్టడాన్నీ ప్రతిఒక్కరూ ఖండించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజా సంఘాల పోరాట వేదిక కన్వీనర్ ఎస్.వీరయ్య కోరారు. పేదలు వేసుకున్న గుడిసెలను పీకేయడం దారుణమని పేర్కొన్నారు. సోమవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కోరుట్ల భూ పోరాట కేంద్రంలో మేడే కోసం పేదలు నిర్మించిన ఎర్ర జెండా దిమ్మెను అర్థరాత్రి రెవెన్యూ అధికారులు కూల్చివేయటం అన్యాయమని తెలిపారు. ప్రపంచ కార్మిక దినోత్సవం రోజు పాలకులు తెగబడి దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారందరినీ తక్షణం విడుదల చేయాలనీ, కేసులు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. జెండా దిమ్మెను కూల్చిన రెవెన్యూ అధికారులను శిక్షించాలని కోరారు. మేడే స్ఫూర్తితో పేదలు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.