Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు రాష్ట్రాల డీజీపీలకు సీఈసీ రాజీవ్ కుమార్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కర్నాటకలో ఈ నెల 10న జరగనున్న ఎన్నికలకు సరిహద్దు రాష్ట్రాలు పూర్తి సహకారం అందించాలని కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలను ఆదేశించారు. సోమవారం ఆయన కర్నాటకతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లను సమీక్షించారు. ''సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, డ్రగ్స్ తదితరాలను అరికట్టేందు కు చెక్‌పోస్టులను, పెట్రోలింగ్‌ను పెంచాలి. ఫ్లయింగ్ స్క్వాడ్లు, మొబైల్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేయాలి. బోగస్ ఓటర్ల పరిశీలన చేపట్టాలి. ముఖ్యంగా పోలింగ్‌కు ముందు చివరి 72 గంటల సమయం లో కర్ణాటకకు ఆనుకుని ఉన్న సరిహద్దు జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున గట్టి నిఘా ఉంచాలి.. '' అని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడు తూ రాష్ట్ర సరిహద్దుల్లో నగదు, అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలు, ఇతర వస్తువుల తరలింపును నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించారు. కర్నాటక ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నదనీ, ఆ రాష్ట్రంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. కర్ణాటక సరిహద్దు జిల్లాల నుంచి తెలంగాణలోకి వ్యక్తుల రాకపోకలు, సామగ్రి తరలింపును పర్యవేక్షించడానికి పోలీస్, ఎక్సైజ్ శాఖల చెక్ పోస్ట్ లను పెంచుతున్నామని వివరించారు. కట్టుదిట్టమైన నిఘా నిర్వహిస్తున్నామని చెప్పారు.