Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తప్పుగా లేబుల్ చేయబడిన థైరాయిడ్ ఔషధం థైరోనార్మ్ బ్యాచ్ మందులను వాడొద్దని తెలంగాణ ఫార్మా సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు ఆకుల సంజయ్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బ్యాచ్ నెంబర్ ఏఈజేఓ713 మందులుంటే వాటిని మెడికల్ షాపుల్లో ఫార్మసిస్ట్లకు ఇచ్చేయాలని సూచించారు. అబాట్ కంపెనీ 25 మైక్రోగ్రామ్ లేబుల్ సీసాలో తప్పుగా 88 మైక్రోగ్రామ్ ట్యాబ్లెట్లను వేసినట్టు ప్రకటించిందనీ, వాటినీ రీకాల్ చేసిందని గుర్తుచేశారు. ఇప్పటికే ఈ ట్యాబ్లెట్లను మధ్యప్రదేశ్, తెలంగాణలో విక్రయించిందని తెలిపారు.