Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మహాసభలో పలు తీర్మానాలు ఆమోదం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం (టీఆర్వీఎస్) నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా గుమ్మడి రాజు నరేశ్, పైళ్ల ఆశయ్య తిరిగి ఎన్నికయ్యారు. వీరితో పాటు ఉపాధ్యక్షులు చిటికెన ముసలయ్య, ఎం బాలకృష్ణ, జ్యోతి ఉపేందర్, సి మల్లేశ్ సహాయ కార్యదర్శులుగా అన్నారపు వెంకటేశ్వర్లు, ఏదునూరి మదార్, పాయిరాల రాములు, కొట్ర నవీన్‌కుమార్, కంచర్ల కుమారస్వామితో పాటు మరో 53 మంది రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. జనగామ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 29,30 తేదీల్లో నిర్వహించిన ఆ సంఘం మహాసభలో వీరందర్నీ ఎన్నుకున్నారు.
తీర్మానాలు ..
- 50 ఏండ్లు నిండిన రజక వృత్తిదారులకు వృద్దాప్య పెన్షన్ ఇవ్వాలి
- రజకులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
- రజక వృత్తి దారులకు రూ.10 లక్షల రుణం ఇవ్వాలి
- ఉచిత విద్యుత్ పథకాన్ని ఎల్టీ 2నుంచి ఎల్టీ4 కు మార్చాలి
- ఉచిత విద్యుత్ లబ్దిదారులకు ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పించాలి
- ప్రభుత్వ ఆస్పత్రులు, లాండ్రీలు, పోలీసు, రైల్వే, విమానయాన విద్యా రంగాల్లోని దోబీ పోస్టులను రజకులకే ఇవ్వాలి
- కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీ కులగణన చేపట్టి,
జస్టిస్ రోహిణి కమిషన్ సిఫారస్సులు అమలు చేయాలి
- పాలకుర్తిలో వీరనారి ఐలమ్మ స్మారక స్మృతి వనం కోసం
ఆరెకరాల భూమి కేటాయించాలి, ట్యాంక్ బండ్‌పై
ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
- ప్రతి గ్రామంలో మోడ్రన్ ' దోబీఘాట్లు,
కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రెండెకరాల స్థలం కేటాయించాలి
- రజకుల ఈనాం భూములకు పట్టాలివ్వాలి,
- రజక వృత్తిదారులందరికీ ఉచితంగా మోటారు సైకిళ్ల్లు ఇవ్వాలి
- చాకి రేవు స్థలాలకు రక్షణ కల్పించాలి.