Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్టీఆర్ భవన్ మేడేలో కాసాని
నవతెలంగాణ - హైదరాబాద్
దోపిడి పాలన పోయి కార్మికులకు, పేద వర్గాలకు మంచి జరగాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి తెలుగుదేశం పార్టీకి చెందిన అన్ని అనుబంధ సంఘాలు సమిష్టి కషి చేయాలని కాసాని పిలుపునిచ్చారు. సోమవారం ఎన్టీఆర్ భవన్లో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 'మే డే' వేడుకలను టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ కే బోస్ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముఖ్యఅతిధిగా పాల్గొని టీఎన్టీయూసీ జెండాను ఆవిష్కరించారు. తదనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. కార్మిక శక్తి ఆజేయమైనదని భావించిన ఆయన తెలుగుదేశం పార్టీలో తెలుగునాడు పేరిట కార్మిక విభాగాన్ని నెలకొల్పి ఆ వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచారన్నారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన 20 మంది కార్మికులకు ఎన్టీఆర్ కార్మిక రత్న అవార్డులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బి.షకీలా రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు పెద్దోజు రవీంద్రచారి, సంద్యపోగు రాజశేఖర్, కనగాల సాంబశివరావు, మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీపతి సతీష్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పొలంపల్లి అశోక్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు షేక్ ఆరీఫ్, జీవీజీ నాయుడు, టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శులు రత్నాకర్‌రావు, పోటు రంగారావు, టీఎన్టీయూసీ కార్యదర్శి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.