Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాజెక్టులపై సమీక్ష
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి - హైదరాబాద్
సుప్రీంకోర్టు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి పనులను కొనసాగించేందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో జులై నాటికి కరివెన జలాశయానికి తాగునీటిని అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనుల పురోగతిపై కొత్తగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో తొలిసారి సీఎం పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందు లో భాగంగా కరివెన జలాశయంకు నీళ్లు తరలించడంతోపాటు ఆగస్ట్ వరకు ఉద్దండాపూర్ వరకు నీటిని ఎత్తిపోయాలని సీఎం అధికారులకు సూ చించారు. నార్లపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాల మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. పంప్‌హౌస్‌లు, విద్యుత్ సబ్స్టేషన్లు, కన్వేయర్ సిస్టమ్‌లోని పెండింగ్ పనులను సైతం వేగంగా ముగించాలని ఆదేశించారు.
ఆ కొద్దిపాటి పనులనూ...
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ పనులకు సంబంధించిన పురోగతిపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. మిగిలిన కొద్దిపాటి పనులనూ ఈ జూన్‌లోగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం సూచించారు. సమీక్షలో మంత్రులు ఎస్. నిరంజన్ రెడ్డి, వి శ్రీనివాస్ గౌడ్, పి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎంపీలు పోతుగంటి రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, కాలె యాదయ్య, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, ఎస్ రాజేందర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, అంజయ్య యాదవ్, ప్రకాశ్ గౌడ్, మహేశ్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్, మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్ సాయిచంద్ హాజరయ్యారు. అలాగే తాండూరు, పరిగి, వికారాబాద్, కొడంగల్, చేవెళ్ళ నియోజక వర్గాల పరిధిలో తాగునీటి అవసరాల నిమిత్తం కాల్వల తవ్వకానికి టెండర్లు పిలవాల్సిందిగా సీఎం కేసీఆర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకష్ణారావు, ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్‌కుమార్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్ పాండే, ఈఎన్సీ మురళీధర్‌రావు, లిఫ్ట్ ఇరిగేషన్ సలహాదారు పెంటారెడ్డి, మిషన్ భగీరథ ఈఎన్సీ కపాకర్‌రెడ్డి, సీఈలు హమీద్ ఖాన్, ధర్మా, ఎస్ఈలు రంగారెడ్డి, శ్రీనివాస్, విజయ భాస్కర్‌రెడ్డి, చక్రధర్, ఏఎస్ఎన్ రెడ్డి, ట్రాన్స్ కో డైరెక్టర్ సూర్య ప్రకాశ్, డీఈ పీఆర్ఎల్ఐఎస్ సయ్యద్ మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.