Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద.మ.రైల్వే జీఎమ్ అరుణ్‌కుమార్ జైన్ ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రైల్వే కార్యకలాపాలు సమర్థ వంతంగా నిర్వహించాలంటే భద్రతకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ అన్నారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా నాన్- ఇంటర్‌లాకింగ్, ట్రాఫిక్ బ్లాక్, పవర్ బ్లాక్ పనులను చేపట్టాలని చెప్పారు. సోమవారంనాడిక్కడి రైల్ నిలయంలో జోన్ పరిధిలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సమీక్షా సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లకు చెందిన డివిజినల్ రైల్వే మేనేజర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎమ్ మాట్లాడుతూ ట్రాక్‌లపై తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే రైళ్ల వేగపరిమితులపైనా ఆయన పలు సూచనలు చేశారు. భద్రతా చర్యలు తీసుకుంటూనే రైళ్ల సగటు వేగాన్ని పెంచేలా వీలైన చోట్ల హెచ్చరిక సూచికలను తొలగించాలని చెప్పారు. జోన్ పరిధిలో జరుగుతున్న డబ్లింగ్, ట్రిపుల్ లైన్లు, విద్యుదీకరణ, స్టేషన్ల పునరభివృద్ధి పనులను నిర్ణీత కాలపరిమితి గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు.