Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామస్తులు పండుగలో ఉండగా ఘటన
నవతెలంగాణ - రాజాపేట
తాళం వేసిన 13 ఇండ్లలో ఏకకాలంలో చోరీ లు జరిగాయి. ఈ ఘటన యాదాద్రిభువనగిరి జిల్లా రాజపేట మండలంలోని సింగారం గ్రామంలో ఆది వారం రాత్రి జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సింగారం పరిధి జాల, బేగంపేటలో ఆదివారం గ్రామదేవతల పండుగ చేశారు. గ్రామస్తులంతా ఇండ్లకు తాళాలు వేసి వెళ్లారు. ఈ సమయంలో చింతల చంద్రయ్య, నరబోయిన కనకయ్య, కోక్కల కిష్టయ్య, చింతల ఐలయ్య, బోనాల వెంకటయ్య, బత్తుల లింగయ్య, ఇద్దల భూలక్ష్మి, మడూరి పద్మ, బొల్లారం ఎల్లయ్య, బొల్లారం నరసయ్య, వంపు బాల నరసయ్య, కోక్కల ఎల్లయ్య, బత్తుల కిష్టయ్య ఇండ్లల్లో దొంగలు చోరీ చేశారు. బీరువాలు పగులగొట్టి మొత్తం 13 ఇండ్లల్లో 3 లక్షల నగదు, 9 తులాల బంగారం, వంద తులాల వెండిని ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న యాదగిరిగుట్ట సీఐ సురేందర్, ఆలేరు ఎస్ఐ వెంకట్ శ్రీను, గుండాల ఎస్ఐ యాకన్న గ్రామాన్ని సందర్శించారు. క్లూస్ టీం సాయంతో వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది.