Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలోనే ఆర్టీసీ కార్మికులకూ పెంచుతాం : సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మేడే కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది పారిశుధ్య కార్మికులకు వెయ్యి రూపాయల చొప్పున వేతనం పెంచుతున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. త్వరలోనే ఆర్టీసీ కార్మికులకూ వేతనాలు పెంచుతామని తీపి కబురు అందించారు. సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయాలను వెల్లడించారు. జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్‌తో పాటు,రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులందరికీ ఈ వేతన పెంపు వర్తిస్తుందన్నారు. పెరిగిన వేతనాలు తక్షణమే అమల్లోకి తీసుకురావాలని అధికారులను ఆదేశిం చారు. త్వరలోనే ఆర్టీసీ కార్మికుల వేతనాలను కూడా పెంచు తామనీ, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖను ఆదేశించామని తెలిపారు. 'సఫాయన్నా..నీకు సలాం అన్నా..' అనే నినాదంతో పారిశుధ్య కార్మికుల కృషిని, త్యాగా లను గుర్తిస్తూ వారి సంక్షేమానికి, అభివృద్దికి తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నదన్నారు. రాష్ట్రంలో కష్టించి పనిచేసే ప్రతి కార్మికుని సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నొక్కి చెప్పారు. తెలంగాణ పల్లెలు, పట్టణాలు గుణాత్మక అభివృద్ధిని సాధించడంలోనూ, జాతీయ, అంతర్జా తీయ స్థాయిలో అవార్డులు రావడంలోనూ పారిశుధ్య కార్మికుల శ్రమ పాత్ర మరువలేనిదని కొనియాడారు. కార్మికు ల కష్టసుఖాలను తెలుసుకుంటూ వారికి అండగా నిలబడు తున్నామని చెప్పారు.పారిశుధ్య కార్మికులు కృతజ్ఞతా భావం తో మనస్ఫూర్తిగా పని చేస్తూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వా ములు కావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.