Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
నేరస్తులకు కోర్టులలో శిక్షలు పడాలంటే ఫోరెన్సిక్ శాస్త్రీయ ఆధారాలే అత్యంత కీలకమని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ అన్నారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్ ఆధ్వర్యాన జరిగిన ఒక రోజు వర్క్ షాప్‌ను ఆయన ప్రారంభించారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అనే అంశంపై జరిగిన ఈ వర్క్ షాపులో డీజీపీ మాట్లాడుతూ.. వివిధ నేరాలలో సూక్ష్మమైన ఆధారాలను కనిపెట్టాలంటే ఫోరెన్సిక్ ఆధారాలే అత్యంత కీలకమని ఆయన తెలిపారు. ముఖ్యంగా నేరం జరిగిన ప్రదేశంలో చిన్నపాటి ఆధారాన్నైనా ఒడిసి పట్టుకుంటే దాని ద్వారానే మొత్తం కేసు పరిష్కారం అవుతుందని , నేరస్తుడికి తప్పని సరిగా శిక్ష పడుతుందని అన్నారు. ఎఫ్ఎస్ఎల్ విభాగం ఇన్చార్జి , రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ మాట్లాడుతూ రాష్ట్ర ఎఫ్ఎస్ఎల్లో పేరుకు పోతున్న కేసులను సత్వరమే పరిష్కరించడానికి అన్ని రకాలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హత్యలు, లైంగికదాడి , దొంగతనాలు మొదలుకుని సైబర్ నేరాల వరకు వాటి ఆధారాల ను విశ్లేషించడంలో ఫోరెన్సిక్ విభాగం అత్యంత కీలకంగా పాత్ర నిర్వహిస్తున్నదని అదనపు డీజీ శిఖాగోయల్ అన్నారు. ఏడు వేలకు పైగా పెండెన్సిలో ఉన్న కేసులను ప్రస్తుతం రెండు వేల వరకు తీసుకు రావడం జరిగిందని అన్నారు. ఈ వర్క్ షాప్‌లో ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ హసీనా పర్వీన్ తో పాటు అనిత ఎంజెన్స్, అదనపు డైరెక్టర్ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఐజీగా ఎం రమేశ్‌కు పదోన్నతి
రాష్ట్ర ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ డీఐజీ ఎం. రమేశ్‌కు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఐజీపీ గా మంగళవారం పదోన్నతి లభించింది. పదోన్నతి లభించాక ఆయనకు తిరిగి అదే పోస్టులో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.