Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేం అధికారంలోకొస్తే రూ.2వేలు పెంచుతాం : బండి
నవతెంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఇచ్చే గౌరవం ఇదేనా? వెయ్యి రూపాయల జీతం పెంపుతో వారికి ఏం ఒరుగుతుంది అని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వారికి రూ.2 వేల వేతనం పెంచుతామని ప్రకటించారు. వారికి ఉద్యోగ భద్రత కల్పనతోపాటు ఠంఛన్‌గా జీతాలు చెల్లిస్తామని హామీనిచ్చారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పారిశుధ్య కార్మికులకు దసరా, ఉగాది పండుగల సందర్భంలో బోనస్ ఇస్తామని తెలిపారు. జనాభా ప్రాతిపదికన పంచాయతీలు, మున్సిపాల్టీల్లో సిబ్బందిని అదనంగా నియమిస్తామని తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వమిస్తున్న శానిటేషన్, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావడంలో పారిశుధ్య కార్మికులదే కీలక పాత్ర అని వివరించారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు కూడా నిర్వహించడం చేతగాని ప్రభుత్వం అవసరమా? అని నిలదీశారు. తెలుగు మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ పేపర్ ఇవ్వడం సిగ్గు చేటు అని పేర్కొన్నారు.