Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని టీఎంఎస్టీఏ అధ్యక్షులు భూతం యాకమల్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి టి హరీశ్‌రావును మంగళవారం హైదరాబాద్‌లో ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు కారుణ్య నియామకాలు లేకపోవడంతో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల పరిస్థితి దయనీయంగా ఉందని తెలిపారు. వారికి న్యాయం చేసేలా కారుణ్య నియామకాలను చేపట్టాలని కోరారు. చనిపోయిన వారి కుటుంబాలకు డెత్ గ్రాట్యూటీ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్, ఆరోగ్య కార్డులను మంజూరు చేయాలని కోరారు. సీనియార్టీ జాబితా విడుదల చేసి బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని తెలిపారు.