Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్, అర్వింద్‌కుమార్ చెప్పాలి : రఘునందన్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్)పై హెచ్ఎండీఏకు వచ్చిన ఆదాయం ఎంత అనే దానిపై మంత్రి కేటీఆర్, ఎమ్ఏఅండ్యూడీ జనరల్ డైరెక్టర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ స్పష్టతనివ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఓఆర్ఆర్ టోల్ బిడ్డ్పై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓఆర్ఆర్పై ఏప్రిల్ 1 నుంచి 30 వరకు రోజు వారి ఆదాయం ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ బిడ్డింగ్‌పై మీడియా సమావేశం ఎందుకు పెట్టలేదు? రెండు పేజీల ప్రెస్నోట్కే ఎందుకు పరిమితం అయ్యారు? రూ.7272 కోట్లకు బిడ్డింగ్ వేస్తే రూ.7380 కోట్లకు అని ఎందుకు ప్రకటించారు? ఏప్రిల్ 11 నుంచి 27వ తేదీ వరకు ఏం జరిగింది? బేస్‌ప్రైజ్ ఎందుకు డిక్లేర్ చేయలేదు? అని ప్రశ్నించారు. బ్రేస్ ప్రైజ్ నిర్ణయించలేదంటేనే పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్టేనని ఆరోపించారు. ఏడాదికి రూ.720 కోట్ల ఆదాయం వస్తుంటే..ప్రస్తుత కంపెనీకి ఏడాదికి రూ.246 కోట్లకు ఎలా ఇస్తారు? అని నిలదీశారు. ప్రస్తుతం టోల్ వసూలు బాధ్యత తప్పుకునే ఈగల్ కంపెనీకి రూ.517 కోట్లు కట్టాలని నోటీసులెలా ఇస్తారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వమే టోల్ నిర్వహణ బాధ్యతను తీసుకుంటే రూ.18,950 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. టెండర్లు వేసిన హెచ్1,హెచ్2,హెచ్3 మూడూ కంపెనీలు ఒక్కటేనని పేర్కొన్నారు. దీనిపై సీవీసీకి వెళ్దామా? కోర్టుకు వెళ్లాలా అనే దానిపై త్వరలోనే నిర్ణయించుకుంటామని తెలిపారు. ఈ టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో సభలు, జాయినింగ్స్ కోసం ఖర్చుపెడుతున్నది ఐఆర్బీ సంస్థనేనా అనే అనుమానం కలుగుతున్నదని పేర్కొన్నారు.