Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుమతి ఉంటేనే చెల్లుబాటు :ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రయివేటు విశ్వవిద్యాలయాల బిల్లు ప్రస్తుతం ప్రభుత్వ పరిధిలో ప్రాసెస్‌లో ఉందని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనుమతి వస్తేనే ప్రయివేటు విశ్వవిద్యాలయం చెల్లుబాటు అవుతుందని వివరించారు. ఒకవేళ అది రాకుంటే ప్రయివేటు వర్సిటీగా గుర్తింపు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల అసెంబ్లీలో ఆమోదించిన ఐదు ప్రయివేటు విశ్వ విద్యాలయాల బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇటీవల తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన విషయం తెలిసిందే. వాటిలో చదివే విద్యార్థుల పరిస్థితేంటని విలేకర్లు ప్రశ్నించగా... రాష్ట్ర ప్రభుత్వం వివరణ పంపించి ఆ బిల్లు ఆమోదించేలా కృషి చేస్తుందని లింబాద్రి చెప్పారు. ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఈ విషయం ఉందన్నారు. అనుమతి వస్తుందనే కారణంతోనే ఆ ప్రయివేటు విశ్వవిద్యాలయాలు అడ్మిషన్లు తీసుకున్నాయని అన్నారు.