Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుద్యోగుల బహిరంగ సభలో ప్రసంగం
- శ్రీకాంతాచారి విగ్రహం వద్ద నివాళి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన నిరుద్యోగుల బహిరంగ సభలో పాల్గొనేందుకు ఈనెల 8న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్‌కు రానున్నారు. సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించనున్నారు. అంతకు ముందు ఎల్బీనగర్ చౌరస్తాలోని శ్రీకాంతాచారి విగ్రహం వద్ద నివాళులర్పించనున్నారు. అక్కడి నుంచి సరూర్‌నగర్ స్టేడియానికి కాలినడన రానున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ సమావేశమయ్యారు. అనంతరం వేం నరేందర్‌రెడ్డి, మాజీ మంత్రి పుష్పలీల, అద్దంకి దయాకర్, ప్రీతం, మెట్టు సాయి కుమార్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రియాంకగాంధీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని నేరుగా హైదరాబాద్ వస్తారని తెలిపారు. బహిరంగ సభ విజయవంతం చేసేందుకు నాయ కులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. అందుకోసం అనేక కమిటీలు వేస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ మేడే సందర్భంగా సీఎం కేసీఆర్ కార్మికులకు శుభ వార్త చెపుతారనుకుంటే నిరాశ పరిచారని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేస్తానం టూ మాట తప్పారని తెలిపారు. పదేండ్ల అయినా కూడా ఇంతవరకు కార్మికులకు న్యాయం చేయలేదన్నారు. ఆర్టీసీ, సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. పనిగంటలు, కనీస వేతనాలు కూడా ఇవ్వలేదన్నారు.