Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మెట్రో వాటర్ వర్కర్స్, గ్రామ పంచాయితి పారిశుధ్య కార్మికులకు మేడే కానుకగా వెయ్యి రూపాయలు పెంచడంతో సరిపెట్టుకోకుండా వారికి లివింగ్ వేతనం అమలు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి కృష్ణ, సూర్యం మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మేడే సందర్భంగా సీఎం ప్రకటన చూస్తే.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉన్నదని పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలతో అనేక రంగాల కార్మికులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని తెలిపారు. వెయ్యి రూపాయల కానుక ఈనాటి ధరలకు సరిపడేది కాదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే పీఆర్సీ జీవో 60ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.