Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్లు గీత కార్మిక సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లో బుధవారం నీరా కేఫ్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికీ, ప్రత్యేక కృషి చేసిన ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌కు కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ అభినందనలు తెలియజేస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో నీరా విధానాన్ని అమలు చేయాలని గత అనేక సంవత్సరాలుగా కల్లుగీత కార్మిక సంఘంతో పాటు వివిధ సంఘాలు, సంస్థలు, వ్యక్తులు డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నీరా, పల్మేర ప్రొడ్యూసర్స్ డెవలప్మెంట్ సొసైటీ, కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో గత ఐదు ఏండ్ల నుంచి ఎగ్జిబిషన్లు నిర్వహించామమని తెలిపారు. అందరి కృషి ఫలితంగా ప్రకృతి పానీయం, ఆరోగ్యానికి ఉపయోగమైన నీరాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలకు అందుబాటులోకి తెవడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లాల్లో కూడా నీరా స్టాళ్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్, బహుళ జాతి కంపెనీల ఉత్పత్తులను తట్టుకుని నిలబడే విధంగా నీరాకు మార్కెట్ కల్పించాలని కోరారు. నీరా, తాటి, ఈత ఉత్పత్తుల ద్వారా గౌడ యువతీ, యువకులకు, గీత కార్మికులకు ఉపాధి కలిగే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు.