Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆదేశాల మేరకు డీఎంఈ పరిధిలోని ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల బదిలీలకు వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు.
మార్గదర్శకాలివే...
- ప్రస్తుతం పని చేస్తున్న చోట కనీసం రెండేండ్ల సర్వీస్ పూర్తయిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
- రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీల్లోని ఖాళీలను మాత్రమే బదిలీల ద్వారా భర్తీ చేస్తారు.
- ఒకవేళ బదిలీ కోసం పెట్టుకున్న దరఖాస్తులు 17 కాలేజీల్లోని ఖాళీల కన్నా ఎక్కువగా ఉంటే.. నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ రిమ్స్‌లో ఖాళీల్లో భర్తీ చేస్తారు.
- కౌన్సిలింగ్ సందర్భంగా ఉస్మా నియా, గాంధీ, కాకతీయ (వరం గల్), నిజామాబాద్ మెడికల్ కాలేజీ ల్లోని ఖాళీలను ఎట్టి పరిస్థితు ల్లోనూ ప్రదర్శించరు.
- ఒక పోస్ట్‌కు ఒకరికన్నా ఎక్కువ మంది దరఖాస్తు చేస్తే స్పౌజ్, అంగవైకల్యం, బుద్ధిమాంద్యులైన పిల్లలు, కారుణ్య నియామకాలు, కుటుంబ సభ్యుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు వంటి అంశాల ఆధా రంగా ప్రాధాన్యతను నిర్ణయిస్తారు.