Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో గందరగోళం నెలకొంది. మంగళ వారం నిర్వహించాల్సిన ఇంటర్ ఎకనామిక్స్ సబ్జెక్టుకు తెలుగు మాధ్యమంకు బదులుగా ఇంగ్లీష్ మీడియం ప్రశ్నాపత్రం రావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఆ పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గతనెల 25 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 13న ఓపెన్ ఇంటర్ ఎకనామిక్స్ రాతపరీక్షను తిరిగి నిర్వహిస్తామని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) డైరెక్టర్ పివి శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు.