Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఐదేండ్ల నిరీక్షణ తర్వాత వైద్యవిద్య విభాగంలో వైద్యుల బదిలీలకు జీవో నెంబర్ 48 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అన్వర్, జలగం తిరుపతిరావు, ఉపాధ్యక్షులు కిరణ్ మాదాల ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకవైపు కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుడుతూనే, మరోవైపు మారుమూల ప్రాంతాల్లో పని చేస్తున్న ఖాళీల ఆధారంగా కొత్త వైద్య కళాశాలలకు వెళ్లే వెసులుబాటు కల్పించారని వారు కొనియాడారు.