Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లోని మున్సిపాలిటీల పరిధిల్లో ఉన్న పేదల ఇండ్ల నిర్మాణం కోసం ఇబ్బందులు లేకుండా, నిబంధనల మేరకు వారి ఇంటి స్థలాలను క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. నోటరీ స్థలాలను క్రమబద్ధీకరిండానికి 2014లో రాష్ట్ర ప్రభుత్వం జీవో 58,59లను జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు జీఓలను అమలు చేయడానికి 14ఫిబ్రవరి2022లో జిఓ నెం.14, 17మార్చి2023లో జీఓ నెం. 29లను సర్కార్ జారీచేసింది. జీఓ నెం.29 గడువు ఏప్రిల్ 30తో ముగియడంతో ఈనెల 31వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీఓ నెం.41ని జారీచేసింది.