Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న తటుకునూరి కోదండ రామాచారి (60) గుండెపోటుతో మంగళవారం మృతి చెందాడు. పోలీ సులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతిరోజు లాగే మంగళవారం కూడా గ్రామ సమీపంలో ఉపాధి హామీ పనులకు వెళ్ళాడు. పనులు చేస్తూనే ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ షేక్ మున్ని, సహచర కూలీలు వెళ్లి పరిశీలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్, ఏపీవో బసవోజు కృష్ణకుమారి, ఎస్ఐ తేజావత్ కవిత సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ముగ్గురు కుమాలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.