Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైతుల బాధలు కేసీఆర్ ప్రభుత్వానికి పట్టటం లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల విమర్శించారు. మంగళవారం హైదరాబాద్లోని తమ కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో 23 జిల్లాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు. అకాల వర్షాలకు సుమారు 10లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. మహబూబాబాద్, ఖమ్మం, జనగాం జిల్లాల్లో మూడు రోజులపాటు పర్యటించానని తెలిపారు.రూ. 30-40వేలు అప్పులు చేసి, పెట్టుబడి పెట్టామనీ, ఇప్పుడు వర్షాలకు చేతికందిన పంట నష్టపోవటంతో రైతులు బోరున విలపించారని చెప్పారు.రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటున్నామంటూ గొప్పలకు పోతున్న సీఎం కేసీఆర్ తమ వాగ్దానాలు మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ఇంత నష్టం జరిగినా వారి దగ్గరకు ఏ ఒక్క అధికారి, ప్రజా ప్రతినిధులు పోలేదని తెలిపారు.