Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కబ్జాదారులపై జవహర్నగర్ పీఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా జవహర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఖాళీ స్థలాలపై కన్నేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై కొరడా జులిపించింది. మంగళవారం ఉదయం హెచ్ఎండీఏ ఎస్టేట్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ యంత్రాంగం స్థానిక పోలీసుల సహకారంతో సంయుక్తంగా కూల్చివేశాయి. హెచ్ఎండీఏ పరిధిలోని పలు సర్వే నెంబర్లలో దాదాపు మూడు వేల(3,000) గజాల స్థలాల్లో వచ్చిన అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. వాటిల్లో మూడు ఇండ్లు, ఐదు బేస్మెంట్లు, కొన్ని కరెంటు స్తంభాలు, కొన్నిచోట్ల కాంపౌండ్ వాల్ నిర్మాణాలు ఉన్నాయి. హెచ్ఎండీఏ భూముల్లో అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారిని గుర్తించారు. వారిపై జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు.