Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్లిప్‌కార్ట్ పుల్‌ఫిల్‌మెంట్ కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల్లో స్వయం సహాయక మహిళా సంఘాలు బలంగా ఉన్నాయని, ఇలాంటి పుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాల నిర్వహణలో సంఘాలను, స్థానిక కమ్యూనిటీలను భాగస్వామ్యం చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సంగారెడ్డిలోని ప్లిప్‌కార్ట్ నూతన పుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాన్ని హైదరాబాద్‌లోని ఓ హోటల్లో వర్చ్యువల్‌గా మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడంతోపాటు వేగంగా మెగరుపడేందుకు డిజిటలీకరణ తోడ్పడుతున్నదని, ఈ-కామర్స్ మరింత బలోపేతం చేసిందని అన్నారు. ఎంఎస్ఎంఈల వృద్ధికి తగిన వాతావరణం సృష్టించేందుకు ప్లిప్‌కార్ట్ కృషి చేస్తున్నదని తెలిపారు. ఆ సంస్థ పెట్టుబడులను స్వాగతిస్తున్నామని, ఈ నూతన ఫెసిలిటీతో స్థానిక విక్రేతలకు మార్కెట్ అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. ఈ-కామర్స్ సంస్థలు సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జీక్యూటీవ్ ఆఫీసర్ కల్యాణ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న నూతన పుల్‌ఫిల్‌మెంట్ కేంద్రం ప్లిప్‌కార్ట్ సరఫరా చైన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నదని అన్నారు. ప్రత్యక్షంగాను, పరోక్షంగాను40వేల ఉద్యోగాలు కల్పిలంచడంలో తమ సంస్థ కీలక పాత్ర పోషిస్తున్నదని తెలిపారు. వేలాది స్థానిక వ్యాపారులు, లక్షలాది మంది వినియోగదారులతో అనుసంధానం చేయనున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, ప్లిప్‌కార్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.