Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడుస్తున్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ల్లో తాత్కాలిక పద్ధతిపై పనిచేస్తున్న సిబ్బంది బదిలీల ప్రక్రియ ఈనెల ఆరో తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేజీబీవీల్లో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్లు, పీజీసీఆర్టీలు, సీఆర్టీలు, ఏఎన్ఎంలు, అకౌంటెంట్లు, పీఈటీలు ప్రస్తుతం ఉన్న కేజీబీవీ నుంచి ఇతర కేజీబీవీలకు మార్పు కోరే సిబ్బంది నుంచి ఆన్లైన్లో ఈనెల ఆరు నుంచి తొమ్మిదో తేదీ వరకు దరఖాస్తు చేయాలని కోరారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన సమగ్ర వివరాలు, సూచనలు, మార్గదర్శకాలు https://transfers.cdse.telanganag.gov.in వెబ్సైట్లో పొందుపరిచామని వివరించారు.