Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం నవంబర్, డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత, ఓటరు జాబితా సంబంధిత అంశాలపై చర్చించారు. అందుకనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి, సన్నాహాలు ప్రారంభించినట్టు ఆయన వివరించారు. జూన్ నెలలో మొదటి విడత ఈవీఎంల చెకింగ్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గస్థాయిలో, జిల్లా కేంద్రంలో ఓటర్ నమోదుపై వారానికొసారి సమీక్షించాలని అధికారులను ఆదేశించారు.
గతంలో వివిధ కారణాలతో తొలగించిన ఓటర్ పేర్లను మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికలో 48 గంటలకు ముందు ప్రచారం ముగిసినప్పటికీ, ఆ నియోజకవర్గానికి సంబంధం లేని నాయకులు చాలా మంది అక్కడే ఉన్నారనీ, రాబోవు ఎన్నికల్లో అటువంటి పరిస్థితులు రాకుండా చూడాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జి. నిరంజన్ కోరారు. అటువంటి పరిస్థితులు పునరావృత్తం కాకుండా చూస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.