Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌలురైతులకూ నష్టపరిహారం ఇవ్వాలి :సీపీఐ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రాల మీద నెపం నెట్టకుండా చిత్తశుద్ధితో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన బాధ్యతగా తక్షణమే పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. కేంద్రం, రాష్ట్రం బీమా పథకం నిలిపేయడం దురదృష్టకరమని అన్నారు. కౌలు రైతుల పంటలకు కూడా పంట నష్టపరిహారమివ్వాలని బుధవారం ఒక ప్రకటనలో కోరారు. గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా 10 లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. మార్చిలో కురిసిన అకాల వర్షాల కారణం గా ఆరు లక్షల ఎకరాల వరి పంటకు నష్టం చేకూరిం దని పేర్కొన్నారు. ఈ పంటలకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తామంటూ పంటలను పరిశీలించి నప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. కానీ ఇప్పటికీ ఆ పంటల నష్ట పరిహా రం అందలేదని పేర్కొన్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఎకరాల మామిడి, ఆరు లక్షల ఎకరాల మొక్క జొన్న, ఇతర పంటలు నష్టపోయాయని వివరించారు. తేమ శాతంతో నిమిత్తం లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించినా 17 శాతం తేమ వస్తేనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తా మంటూ కింది స్థాయి అధికారులు అంటున్నారని తెలిపారు. దీంతో వరి ధాన్యాన్ని కల్లాలలో ఆరబెట్టుకునే క్రమంలో అకాల వర్షాలకు పూర్తిగా ధాన్యం తడిచిపోయి మొలకలెత్తి పాడై పోయిందని పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద నిల్వ చేసుకునే సామర్థ్యం, మిల్లర్ల కు అమ్ముకునే వెసులుబాటు ఉన్నందున వెంటనే తేమశాతం, మొలకలతో సంబంధం లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.