Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిగతా బాధితుల కోసం ఆరా తీస్తున్న అధికారులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
కృషి బ్యాంకులో డిపాజిట్లు పెట్టి మోసపోయిన బాధితుల్లో కొందరికి రూ. 8 లక్షలను సీఐడీ అధికారులు చెల్లించారు. బుధవారం నాంపల్లి కోర్టులో జరిగిన ఒక కార్యక్రమంలో బ్యాంకు లిక్విడేచర్తో పాటు సంబంధిత మేజిస్ట్రేటు సమక్షంలో డిపాజిటర్లకు చెక్కులను అందజేశారు. 2001లో కృషి బ్యాంకు వందలాది మంది డిపాజిటర్లను మోసం చేసి బోర్డు తిప్పేసిన విషయం తెలిసిందే. ఆ కేసును విచారించిన సీఐడీ అధికారులు కోర్టు ఆదేశాల మేరకు సదరు బ్యాంకుకు చెందిన ఆస్థులను జప్తు చేయడం, వాటిలో కొన్ని ఆస్థులను కోర్టు ఆదేశాల మేరకు విక్రయించి రూ. 13 కోట్ల మేరకు కొందరు డిపాజిటర్లకు ఇవ్వాల్సిన డబ్బులను చెల్లించడం జరిగింది. తాజాగా మరికొన్ని ఆస్థులను విక్రయించగా వచ్చిన రూ.8,07000 లను 31 మంది బాధితులకు చెల్లించినట్టు సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ తెలిపారు. ఇంకా వంద మంది వరకు బాధితులు మిగిలి ఉన్నారనీ, వారికి కూడా త్వరలోనే చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు.