Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆగేయ బంగాళాఖాతంలో ఈ నెల ఆరోతేదీ నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఏడో తేదీ నాటికి అది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. ఇది ఎనిమిదో తేదీ నాటికి తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమయ్యే అవకాశముందనీ, మధ్య బంగాళాఖాతం వైపు కదులుతూ తీవ్రమయ్యే అవకాశముందని సూచించారు. దీని ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని పేర్కొన్నారు. రాబోయే 48 గంటల పాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన, ఎక్కువ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నాయి. బుధవారం రాత్రి 9 గంటల వరకు రాష్ట్రంలో 120కిపైగా ప్రాంతాల్లో వర్షం కురిసింది.