Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారుకు కృతజ్ఞతలు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇచ్చిన హామీ మేరకు 177 మంది కాంట్రాక్టు ల్యాబ్ టెక్నీషియన్ల సేవలను రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఈ మేరకు బుధవారం వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల రవీందర్, కాంట్రాక్టు క్రమబద్ధీకరణ బాధ్యులు నగేష్, రామారావు, జ్యోతి, శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చొరవతో క్రమబద్దీకరించారని వారు కొనియాడారు. హామీని నిలబెట్టుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు మాట నిలుపుకోలేదనీ, కానీ ల్యాబ్ టెక్నీషియన్లను అక్కున చేర్చుకుని వారు ఆత్మగౌరవంతో జీవించేలా బీఆర్ఎస్ సర్కారు నిర్ణయం తీసుకుందని హర్షం వ్యక్తం చేశారు. నూతన సచివాలయం ప్రారంభం రోజునే సీఎం కేసీఆర్ సంతకం చేయడం, ఆ మేరకు జీవో విడుదల అయిందని ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.